Search Help

Search the whole Bible in your chosen Translation.

1. Find Verses Using Words

Examples:

Notes:

2. Find Verses Using Advanced Matching

Finds baptism, baptize, baptized, baptizing

Finds love, loved, loving

3. Find a passage

Opens John chapter 3.

Opens John 3, verses 16–17. A book name on its own, such as "John", searches for that word.

హోషేయ 14

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పశ్చాత్తాపడమని పిలుపు

1 ఇశ్రాయేలూ, నీ పాపం చేత నీవు కూలిపోయావు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరుగు.

2 ఒప్పుకోలు మాటలు సిద్ధపరచుకుని యెహోవా దగ్గరికి తిరిగి రండి.

మీరు చెప్పవలసినదేమిటంటే “మా పాపాలన్నిటిని పరిహరించు. మమ్మల్ని అనుగ్రహంతో స్వీకరించు.

అప్పుడు మేము మా పెదాల ఫలాలను అంటే స్తుతులను అర్పిస్తాము.

3 అష్షూరీయులు మమ్మల్ని రక్షించరు.

మేమిక మీదట గుర్రాలెక్కి యుద్ధానికి పోము.

‘మీరే మాకు దేవుడు’ అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము.

తండ్రిలేని వారికి వాత్సల్యం నీ దగ్గరే దొరుకుతుంది.”

4 వారు నన్ను వదిలి వెళ్ళిపోయిన తరువాత నేను వారిని బాగు చేస్తాను.

వారి మీదనున్న నా కోపం చల్లారింది.

మనస్ఫూర్తిగా వారిని ప్రేమిస్తాను.

5 చెట్టుకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉంటాను.

తామర పువ్వు పెరిగేలా అతడు అభివృద్ధి పొందుతాడు.

లెబానోను పర్వతాల్లో దేవదారు వృక్షంలాగా వారు వేరు పారుతారు.

6 అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి.

ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది.

లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.

7 అతని నీడలో నివసించేవారు తిరిగి వస్తారు.

ధాన్యం వలే వారు తిరిగి మొలుస్తారు.

ద్రాక్షచెట్టులాగా వికసిస్తారు.

లెబానోను ద్రాక్షరసానికి ఉన్న కీర్తి వారికి ఉంటుంది.

8 ఎఫ్రాయిము ఇలా అంటాడు “బొమ్మలతో నాకిక పనేమిటి?”

నేనే అతనికి జవాబిచ్చి ఆలకిస్తున్నాను.

నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేస్తున్నాను.

నేను సతత హరిత సరళ వృక్షం వంటి వాణ్ణి.

నావల్లనే నీకు ఫలం కలుగుతుంది.

9 ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు?

వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు?

ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి.

నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.

హోషేయ 14