Search Help

Search the whole Bible in your chosen Translation.

1. Find Verses Using Words

Examples:

Notes:

2. Find Verses Using Advanced Matching

Finds baptism, baptize, baptized, baptizing

Finds love, loved, loving

3. Find a passage

Opens John chapter 3.

Opens John 3, verses 16–17. A book name on its own, such as "John", searches for that word.

యెషయా 15

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మోయాబు గురించి ప్రకటన

1 మోయాబు గురించి ప్రకటన.

ఒకే రాత్రిలో ఆర్ మోయాబు పాడై నాశనమౌతుంది.

ఒక్క రాత్రిలో కీర్ మోయాబు పాడై నాశనమౌతుంది.

2 ఏడవడానికి మోయాబీయులు గుడికీ,

మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు.

నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు.

వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు,

గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.

3 తమ సంత వీధుల్లో గోనెపట్ట కట్టుకున్నారు.

వాళ్ళ మేడల మీద, వాళ్ళ బహిరంగ ప్రాంగణాల్లో వాళ్ళందరూ ప్రలాపిస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు.

4 హెష్బోను, ఏలాలే మొర్ర పెడుతున్నాయి.

యాహసు వరకూ వాళ్ళ స్వరం వినిపిస్తూ ఉంది.

మోయాబీయుల యోధులు బిగ్గరగా ఏడుస్తున్నారు.

వాళ్ళ ప్రాణాలు వాళ్ళల్లో వణుకుతున్నాయి.

5 మోయాబు కోసం నా హృదయం అరుస్తూ ఉంది.

దాని ప్రధానులు సోయరు వరకూ పారిపోతారు.

లూహీతు ఎక్కుడు మార్గంలో ఏడుస్తూ ఎక్కుతారు.

నాశనమై పోయామే అని పెద్దగా కేకలు వేస్తూ హొరొనయీము మార్గంలో వెళ్తారు.

6 ఎందుకంటే నిమ్రీములో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి.

గడ్డి ఎండిపోయింది. కొత్తగా పుట్టిన గడ్డి కూడా ఎండిపోతుంది. పచ్చదనం ఎక్కడా కనిపించదు.

7 వాళ్ళు సంపాదించిన ఆస్తినీ, వాళ్ళు కూర్చుకున్న పంటనూ నిరవంజి చెట్లున్న నది అవతలకు వాళ్ళు మోసుకు పోతారు.

8 రోదన మోయాబు సరిహద్దుల్లో వినిపించింది.

అంగలార్పు ఎగ్లయీము వరకూ, బెయేరేలీము వరకూ వినిపించింది.

9 ఎందుకంటే దీమోను నీళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి.

కాని నేను దీమోను మీదకి మరింత బాధ రప్పిస్తాను.

మోయాబులోనుంచి తప్పించుకున్న వాళ్ళ మీద, ఆ దేశంలో మిగిలిన వాళ్ళ మీద ఒక సింహం దాడి చేస్తుంది.

యెషయా 15